వెండితెరకు విశ్రాంతి..!

UPDATED 2nd MARCH 2018 FRIDAY 8:00 PM

సామర్లకోట: దక్షిణాది రాష్ట్రాల సినీ నిర్మాతల మండలి ఇచ్చిన పిలుపుమేరకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని అన్ని సినిమా థియేటర్లను శుక్రవారం నుంచి మూతపడ్డాయి. ఆయా థియేటర్ల వద్ద డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్ల ఛార్జీలకు వ్యతిరేకంగా సినిమా ప్రదర్శనలను బంద్‌ చేస్తునట్లు బోర్డులు దర్శనమిచ్చాయి. శుక్రవారం హోలీ పండుగ కావడంతో కాస్త సేదతీరదామని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు నిరాశకు ఎదురైంది. ఒకప్పుడు సినిమాలను రీళ్ల ద్వారా ప్రదర్శించేవారు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో దీనిలోనూ డిజిటల్‌ విధానం ప్రవేశించింది. ఇప్పుడు ఒక్క క్లిక్‌తోనే సినిమా తెరపై ప్రత్యక్షమవుతోంది. ఈ విధానంలో థియేటర్‌లో సినిమా ప్రదర్శించేందుకు డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ఛార్జీలను తగ్గించాలంటూ చిత్ర పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని డిజిటల్ చార్జీలు రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us