Annavaram: అన్నవరంలో నిత్యాన్నదానం తాత్కాలికంగా నిలుపుదల

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదానం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నిత్యాన్నదానం ద్వారా హాలులో కూర్చుని భోజనాలు చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని, భక్తులు భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్ల ద్వారా వస్తున్నప్పుడు పులిహోర, దద్దోజనం పంపిణీ చేయాలని ఆదేశించడంతో దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆలయ ప్రాంగణంలోని సర్క్యులర్ మండపంలో పులిహోర, దక్షోజనం పంపిణీ చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులను పరోక్ష పద్ధతిలో స్వామి సేవల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని అధికారులు సూచించారు. భక్తులను మాస్కు లేకుండా క్యూలైన్లలోకి అనుమతించవద్దని, అవగాహన కల్పించే విధంగా బోర్డులు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us