రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో తెలంగాణ మద్యం పట్టివేత

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 29 ఆక్టోబర్ 2021: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సీఐ విజయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓకాపూరి ప్రత్యేక ప్రయాణికుల రైల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి జిల్లాలోని లంక గ్రామాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. వీరి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే 350 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us