గుర్తు తెలియని వ్యక్తి మృతి

UPDATED 26th JANUARY 2018 FRIDAY 6:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో స్థానిక బ్రిడ్జి పై ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉదయం నుంచి పడి ఉండడం చూసిన కానిస్టేబుల్ ఎస్సై కి ఫిర్యాదు చేసాడు. ఎస్సై శ్రీనివాస్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇతను చనిపోయి ఉన్నాడు అని గమనించారు. ఇతను చెత్త ఏరుకునే వాడిలా ఉన్నాడు అని భావించి అతని వద్ద గల సంచిని తెరచి చూడగా అందులో చెత్త కాగితములు, పాత బాటిల్సు కనిపించాయి. ఆ వ్యక్తి వయస్సు సుమారుగా డెబ్భై ఆరు సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేశారు. అతను తెలుపురంగు చొక్కా, తెలుపురంగు లుంగీ  వేసుకుని ఉన్నాడని ఎస్సై తెలిపారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us