చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలివెళ్లిన సిపిఐ శ్రేణులు

UPDATED 4th MARCH 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరుతూ చలో పార్లమెంట్ కార్యక్రమానికి ఆదివారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో భారీగా ఢిల్లీ తరలివెళ్లారు. ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో కేంద్రంలో బిజెపి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమానికి జుత్తుక కుమార్, నక్కా కిషోర్, అమలాపురం సత్యబాబు, అలాగే సామర్లకోట సిపిఐ పార్టీ నాయకులు పెదిరెడ్డి సత్యనారాయణ, వెలిశెట్టి దాసు, కామిరెడ్డి బోడకొండ, పిల్లా రఘు, పోతుల బాపిరాజు, పెదిరెడ్డి అర్జునరావు, తదితరులు ఢిల్లీ వెళ్లిన వారికి సంఘీభావం తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us