UPDATED 2nd MARCH 2022 WEDNESDAY 09:00 PM
Radhe Shyam: రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది.. ఇక ఏమాత్రం సైలెన్స్ గా ఉన్నా ఫాన్స్ నుంచి వచ్చే కామెంట్స్ తట్టుకోలేం అనుకున్నారు రాధేశ్యామ్ టీమ్. వరసగా అప్ డేట్స్ ఇస్తూ, ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు. లేటెస్ట్ గా సూపర్ అప్ డేట్ తీసుకొచ్చారు రాధేశ్యామ్ మేకర్స్. సినిమాలో విక్రమాదిత్య కథను న్యారెట్ చేసేది స్టార్ డైరెక్టర్ రాజమౌళి అని రివీల్ చేసిన మేకర్స్ వరసగా ఆ వెంటనే మరో ట్రైలర్ కూడా తీసుకొచ్చారు. అదే పనిగా ప్రమోషన్ కార్యక్రమాలు ఎలా చేస్తారో కూడా రిలీవ్ చేశారు. వరసగా ఇచ్చే అప్ డేట్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
రాధేశ్యామ్ సినిమా హిందీ వెర్షన్ కు బిగ్ బి వాయిస్ ఓవర్ అందించారన్న విషయాన్ని రివీల్ చేయడంతో సర్ ప్రైజ్ ఫీలయ్యారు. బాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలకు వాయి ఓవర్ ఇచ్చిన అమితాబ్.. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాను న్యారేట్ చేయబోతున్నారంటే. బిగ్ బి న్యారేషన్ తో 1970స్ బ్యాక్ డ్రాప్ లోని విక్రమాదిత్య స్టోరీ హైలైట్ అవుతుందని సంబరపడుతున్నారు ప్రభాస్ ఫాన్స్.