కన్నులపండువగా గోదాదేవి కల్యాణం

అంతర్వేది (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం గోదాదేవి కల్యాణం కనులపండువగా జరిగింది. ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి గోదాదేవి కల్యాణాన్ని వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం అంతర్వేది అన్నాచెల్లెల గట్టు, లైట్‌హౌస్‌, బీచ్‌ తదితర ప్రదేశాల్లో భక్తులు, సందర్శకులు సందడి చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us