Suicide: కరోనా భయంతో భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

కుప్పం (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా భయంతో ఓ యువకుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి (30) కుటుంబ కలహాలతో నిన్న రాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో అతడికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధరణ అయింది. కరోనా భయంతో అతను ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని అద్దం పగులగొట్టి కిందకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరోనా భయంతోనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us