Chandrababu: చిరంజీవి పార్టీ పెట్టకపోతే అధికారంలోకి వచ్చేవాళ్లం: చంద్రబాబు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022: చిరంజీవిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కూడా చిరంజీవి తనతో బాగానే ఉన్నారని చెప్పారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగమన్నారు. సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది లేదని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు, ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ఈ-పేపర్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు ఏపీలో సినిమా రేట్ల వివాదంపై స్పందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us