స్పందన అర్జీలను త్వరగా పరిష్కరించాలి

▪️ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృత్తికా శుక్లా
▪️ జిల్లాస్థాయి స్పందనకు విశేష ఆదరణ 
▪️ స్పందన ఏర్పాట్లులో అధికారులు విఫలం 
▪️ దాహంతో అర్జీదారులు విలవిల
▪️ అర్జీదారులపై కలెక్టరేట్ సిబ్బంది దురుసు ప్రవర్తన
▪️ పెద్దాపురం ఎస్ఐపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
▪️ సర్వర్ పనిచేయక రసీదులు కోసం అర్జీదారులు పడిగాపులు

UPDATED 9th MAY 2022 MONDAY 6:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో  సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి 125 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీలు పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒకసారి స్పందనలో వచ్చిన అర్జీ నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయకుండా అర్జీదారులు మళ్లీ మళ్లీ స్పందనకు వచ్చే పరిస్థితిని రానివ్వకూడదని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల అర్జీదారులను దృష్టిలో ఉంచుకుని ప్రతీ నెలలో ఒక సోమవారం స్పందన కార్యక్రమాన్ని డివిజన్/నియోజకవర్గ/మండల కేంద్రంలో నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అలాగే అంతర శాఖల సమన్వయ వేదికలో ఉపాధి హామీ పధకం ద్వారా అమృత సరోవర్ కార్యక్రమం క్రింద  గ్రామాల్లో కనీసం ఒక ఎకరం విస్తీర్ణం ఉన్న చెరువులకు పూడిక తీసి, ఆ మట్టితో బండ్ పటిష్టీకరణ, సందరీకరణ చేపట్టేందుకు పనులను ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతీ రాజ్ శాఖలు ప్రతిపాదనలు సిద్దం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పెద్దాపురం, మండల పరిధిలోని వడ్లమూరు గ్రామంలో జగనన్న లేఅవుట్లు, ఏరియా హాస్పటల్ ను ఆమె పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలాక్కియా, జిల్లా రెవిన్యూ అధికారి కె. శ్రీధరరెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, పెద్దాపురం ఆర్డీవో జె. సీతారామారావు, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us