శాంతివర్ధనలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

UPDATED 31st DECEMBER 2017 SUNDAY 4:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు శాంతివర్ధన మానసిక వికలాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సమక్షంలో జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి(బాబు) భారీ కేకును కట్ చేసి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ మానసిక వికలాంగుల పట్ల ప్రతీ ఒక్కరూ దయ కలిగి ఆప్యాయతతో మెలగాలన్నారు. జనసేన జిల్లా మహిళా నాయకురాలు కడలి ఈశ్వరి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సర వేడుకలను చిన్నారులతో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఈ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయసహకారాలు అందిస్తానన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ రాయవరపు వీరబాబుని అభినందించి పలువురు దాతలు పాఠశాలకు వస్త్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుమ్మల సూర్య కృష్ణమూర్తి, అనుశ్రీ ఫిలిమ్స్ డిస్టిబ్యూటర్ సత్యనారాయణ, విజయ గోపాల్, చింతపల్లి బన్ని, నాగు, బాబీ, వాసు, గణేష్, చిన్న, ప్రసాద్, పెద్దాపురం జనసేన నాయకులు లక్ష్మణ్, దివాకర్, పోతుల మణికంఠ, నరేంద్ర, నెల్లిపూడి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us