ఫోన్‌లో నెట్ వాడుతున్నారా...

UPDATED 12TH MAY 2017 FRIDAY 4:00 PM

REDBEENEWS: మొబైల్‌లో ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ చేస్తున్నారా? కనీస జాగ్రత్తలు లేకుండా నెట్ వాడితే మీ ప్రైవసీ సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఈ విషయంలో కనీస అవగాహన అవసరం. ఈ చిట్కాలు ఫాలో అవండి. ఫోన్‌లో బ్రౌజర్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎర్రర్ ఏమైనా ఉంటే తొలగిపోయి బ్రౌజింగ్ వేగం పెరుగుతుంది. నెట్ వాడుతున్నప్పుడు మీరు ఎంచుకున్న ఫ్రిపరెన్సులను గుర్తుంచుకోవడానికి కుకీస్ ఉపయోగపడుతాయి. కుకీస్‌ను అవసరం మేరకే అనుమతించాలి. ఎక్కువ కుకీస్‌ను అనుమతిస్తే కొన్ని వెబ్‌సైట్‌లు ఓపెన్ కావు. బ్రౌజ్ చేస్తున్న సమయంలో అన్ని ఆన్‌లైన్ అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్ సెట్ చేసుకోకండి. ఇది చాలా ప్రమాదకరం. హ్యాక్ చేయడానికి సులభం అవుతుంది. పొరపాటున మీ సింగిల్ పాస్‌వర్డ్ ఇతర వ్యక్తులకు తెలిస్తే తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కో అకౌంట్‌కు ఒక్కో పాస్‌వర్డ్ పెడితే సేఫ్‌గా ఉంటుంది.ఎక్కువ సంఖ్యలో ప్లగిన్స్, ఎక్స్‌టెన్షన్‌లను జోడించటం వల్ల బ్రౌజర్ వేగం తగ్గుతుంది. అవసరమైన ప్లగిన్‌లను ఉంచుకుని అనవసరమైనవి అన్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం. ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అప్లికేషన్‌లకు సంబంధించిన ప్రైవసీ సెట్టింగ్‌లను పరిశీలించిన తర్వాతనే ప్రొసీడ్ అవండి. అవసరమైన యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోండి. యూఆర్‌ఎల్స్ ఎంపిక విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలియని అనుమానాస్పద వెబ్‌సైట్ ఓపెన్ చేసి రిస్క్ చేయొద్దు. ఏది పడితే అది క్లిక్ చేస్తే ఆటోమెటిక్ హ్యాకింగ్ జరుగొచ్చు. ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను ఎప్పటికప్పుడు ఆఫ్ చేసి ఉంచండి. లేకపోతే మీ ఫోన్ ఎక్కడపడితే అక్కడ ఏ డివైజ్‌కి పడితే ఆ డివైజ్‌కు కనెక్ట్ అయి వైరస్ వస్తుంది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us