JC Prabhakar Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మండిపడ్డ జేసి ప్రభాకర్ రెడ్డి

UPDATED 16th FEBRUARY 2022 WEDNESDAY 05:45 PM

అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం ఏర్పాటుపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. బుధవారం 10 టీవీ ప్రతినిధితో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. తాడిపత్రి అబివృద్దికి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అబివృద్ది చేసితీరుతానని జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో మున్సిపాలిటీ స్థలాలు కబ్జాకు గురౌతున్నాయని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఏలాంటి స్పందన లేదన్నారు. స్థలాల కబ్జాపై ఏడాది క్రితం ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us