AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. ఉగాది నుంచే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 08:30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని జగన్‌ తెలిపారు. ఉగాది నుంచే కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆదేశించారు. సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను సీఎంకు అధికారులు వివరించారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను వివరించారు.

అలాగే ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాలని, దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us