AP News: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభం

Updated 24 January 2022 Monday 19:10 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్) : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపు లేదా ఎల్లుండి నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో వైసీపీ ప్రకటించింది. అరకు పార్లమెంటును రెండు జిల్లాలగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 38 రెవెన్యూ డివిజన్లలో మార్పులకు సూచించినట్లు సమాచారం. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, 3 డివిజన్ల రద్దుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. ఏపీలో 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామంటూ గడిచిన ఎన్నికల సందర్భంగా వైసీపీ హామీ ఇచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామంటూ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వైసీపీ ప్రకటించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us