Chandrababu:ఉద్యోగులంటే అంత అలుసా..వాళ్లని ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?: చంద్రబాబు

UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 03:40 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. కొత్త పీఆర్సీ జీవోలను వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై అహంకారంతో కాకుండా.. ఆలోచనతో స్పందించాలని చంద్రబాబు సూచించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us