పెద్దాపురం మున్సిపాల్టీకి 12వ ర్యాంక్

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 20 నవంబరు 2021: పెద్దాపురం మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో 12వ ర్యాంక్ లభించింది. సౌత్ జోన్ సంబంధించి 25 వేల నుంచి 50 వేల జనాభా కేటగిరీ సంబంధించి ఈర్యాంక్ లభించినట్టు మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపిక కావడానికి సేవాస్థాయి పురోగతి, నాణ్యమైన చెత్త సేకరణ, ప్రత్యేక వాహనాల నిర్వహణ, పారిశుద్య పనితీరు, ప్రజలకు మెరుగైన సేవలందించడం, తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో మెరుగైన ఫలితాలు చూపడంతో సేవలందించినందుకు ఈ ర్యాంక్ లభించిందన్నారు. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ కు సంబంధించి 16వ ర్యాంకు లభించినట్లు చెప్పారు.  గతంకంటే అన్ని విభాగాల్లో మెరుగైన ఫలితాలు రావడంతో ర్యాంకింగ్ లో ముందుకురావడం జరిగిందన్నారు. సౌత్ జోన్లో పెద్దాపురం పట్టణానికి 12వ ర్యాంక్ పొందడం వెనుక పట్టణ ప్రజల సహకారం ఎంతో ఉందన్నారు. అలాగే అవార్డు పొందడానికి కృషి చేసిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ దావీదురాజు, ఇతర విభాగాలను ఆయన అభినందించారు. పెద్దాపురం మున్సిపాలిటీ 12వ ర్యాంక్ పొందడం పట్ల మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసీమంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us