APSRTC: తిరుమల వెళ్లే భక్తులకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం

Updated 2 February 2022 Wednesday 07:30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): సుదూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తులకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. తిరుపతి- తిరుమల మధ్య సులభంంగా రాకపోకలు కొనసాగించేందుకు నూతన విధానం తీసుకొస్తున్నట్టు తెలిపింది. తిరుపతి బస్సులో సీటు బుక్ చేసుకునేటప్పుడే తిరుమల రాకపోకలకు కలిపి టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. బస్సు టికెట్ సహా శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నవారికి తిరుమలకు టికెట్లు జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. తిరుమల రాకపోకలకు టికెట్ తీసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. భక్తులు తిరుపతి వెళ్లాక అదే టికెట్ తో తిరుమలకు రాకపోకలు చేసే సదుపాయం కల్పించనున్నట్టు వెల్లడించారు. తిరుపతి చేరుకున్న సమయం నుంచి 12గంటల పాటు తిరుపతి- తిరుమల మధ్య టికెట్ చెల్లుబాటవుతుందన్నారు. రేపట్నుంచే ఈ నూతన విధానం అమలు చేస్తున్నట్టు చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us