మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి

UPDATED 21st JANUARY 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట : మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి... అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న అనంతరం అక్కడి నుండే తన యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి(బాబు) ఆధ్వర్యంలో సామర్లకోటలోని స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్దకు చేరుకుని ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా సమస్యల అవగాహనకు తమ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర దిగ్విజయం కావాలని ప్రసన్నాంజనేయునికి పూజలు చేశారు. అనంతరం జనసేన నాయకుడు తుమ్మల బాబు మాట్లాడుతూ తమ అధినేత నిర్ణయం తమకు చాలా ఆనందం కలిగించిందని తమ అధినేత చేపట్టబోమే యాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. మిగిలిన పార్టీల్లా ఎక్కడో గదులలో కూర్చుని మ్యానిఫేస్టోలు తయారుచేయడం కాకుండా ప్రజలలోకి వచ్చి వారి సమస్యలు, వేదనలు దగ్గరి నుండి తెలుసుకుని తద్వారా తమ పార్టీ కార్యాచరణ రూపొందిస్తారని, అలాగే వీలైనంత ఎక్కువ మంది కలవాలనే ఉద్దేశ్యంతో బస్సు యాత్ర ప్రారంభించాలనుకుంటున్నారని వెనుకబడిన రాష్ట్ర ప్రగతి మరలా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాలలో ఉండాలని వారిని అందరం ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్. ఉదయ్ కుమార్, బీరక ప్రసాద్, నున్న గణేష్ నాయుడు, పెనికీ వెంకటలక్ష్మి, సనా నారాయణరావు, తుమ్మల ప్రసాద్, సరోజ్ వాసు, ఎమ్.డి. సఫుల్లా, నెల్లిపూడి శ్రీకాంత్, తమనర లక్ష్మణ్ దివాకర్, మకాం నరేంద్ర, పోతుల మణికంఠ, సుబ్బు, కరెడ్ల రాజా, చందు, మరియు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్లొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us