మాధవన్ 40 లక్షల బైక్ చూశారా?

UPDATED 24th OCTOBER 2017 TUESDAY 11:00 AM

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అభిమానులకు సుపరిచితమైన స్టార్ హీరో మాధవన్‌కు బైకులంటే ఎంతిష్టమో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. మార్కెట్‌లోకి ఏ కొత్త మోడల్ వచ్చినా అది అతని గ్యారేజీలో ఉండాల్సిందే. ఇప్పుడు లేటెస్ట్‌గా అమెరికన్ బైక్ ద ఇండియన్ రోడ్‌మాస్టర్‌ను కొన్నాడు. దీని ధర అక్షరాలా రూ.40.45 లక్షలు. మొన్న దీపావళి రోజే ఈ బైక్ ఇంటికి వచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ బైక్ డెలివరీకి చెందిన వీడియో, ఫొటోలను మాధవన్ పోస్ట్ చేశాడు. లగ్జరీ క్రూజర్స్‌లో రోడ్‌మాస్టర్ కూడా ఒకటి. 2016లోనే తొలిసారి ఇండియాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ కాస్ట్‌లీ బైక్ కనిపించింది. కళ్లు చెదిరే ఫీచర్లు ఈ బైక్ సొంతం. ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఏడు ఇంచుల టచ్ స్క్రీన్ ఈ బైక్‌కు ఉంటుంది. అందులో మ్యూజిక్ ప్లే చేసుకోవడంతోపాటు నావిగేషన్, ఇతర సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఈ బైక్‌కు స్మార్ట్‌ఫోన్‌ను కూడా లింకు చేసుకోవచ్చు. యూఎస్‌బీ, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఈ రోడ్‌మాస్టర్ కంటే ముందు మాధవన్ దగ్గర బీఎండబ్ల్యూ కే1600 జీటీఎల్, డ్యుకాటి డియావెల యమహా బీ-మ్యాక్స్‌లాంటి కాస్ట్‌లీ బైక్స్ ఉన్నాయి. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us