ఆదిత్యలో విజయవంతంగా ముగిసిన ప్రత్యేక శిక్షణ

UPDATED 27th OCTOBER 2018 SATURDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గల ఆదిత్య టెక్నికల్ హబ్ విభాగం ఆధ్వర్యంలో ఆదిత్య పాలిటెక్నిక్ విద్యార్థులకు గత ఆరు నెలలుగా నిర్వహిస్తున్నఇండస్ట్రియల్ ట్రైనింగ్ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు టెక్నికల్ హబ్ సిఇవో బాబ్జి నీలం తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి.కె.టి. కుమార్ పాల్గొని విద్యార్థినీ, విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు. ఆరు నెలలపాటు 74మంది విద్యార్థులకు సిస్కో సాంకేతిక నిపుణులు వీరబాబు, షైపు జమ, అశోక్, వెబ్ డిజైనింగ్ నిపుణులు సుధీర్, భూపతి, సిస్కో సి.సి.ఇ.ఎన్.టి వెబ్ టెక్నాలజీస్ పై శిక్షణ ఇవ్వడం జరిగిందని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు కౌశిక్, అరవింద్, భార్గవిలకు ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగిందని, శిక్షణలో పాల్గొని ధ్రువీకరణ పత్రాలు పొందిన విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని బాబ్జి తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ నిర్వహించడం పట్ల ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, తదితరులు అభినందించారు.  

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us