ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా సాధికారమిత్రలు

UPDATED 14th AUGUST 2018 TUESDAY 6:30 PM

సామర్లకోట: ప్రభుత్వానికి,  ప్రజలకు మధ్య వారధిగా సాధికారమిత్రలు పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక టిటిడిసిలో మండల అధ్యక్షుడు ఏ. సత్యనారాయణ అధ్యక్షతన మండల సాధికారమిత్రలతో ముఖాముఖి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ మండలంలో 881 మంది సాధికారమిత్ర సభ్యులు ఉన్నారని, 35 కుటుంబాలకు ఒక్కొక్క సాధికారమిత్ర  ఉన్నారని, ప్రభుత్వపరంగా ఉన్న సమస్యలను తెలుసుకుని అధికారులకు తెలియచేసి పరిష్కరించాల్సిన బాధ్యత సాధికారమిత్ర సభ్యులదని అన్నారు. పేదవారికి ప్రభుత్వ పరంగా అందచేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో వారికి చేరేలా సాధికారమిత్రలకు పూర్తి స్వేచ్చ ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వం ఉచిత వైద్యం, విద్య, మొక్కలు నాటడం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన, పింఛన్లు, రేషన్, తదితర ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందని, నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాలు  నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. పేదవారికి వైద్య ఖర్చులు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందచేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలను అన్ని విధాల ఆదుకోవడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధికారమిత్రలతో మంత్రి ముఖాముఖి ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. అనంతరం రూ. 19,26,000 ఎస్సీ రుణాలకు సంబందించి చెక్కును మంత్రి సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్ చైర్మన్ చిట్టిబాబు, జెడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఎంపీడివో సి.హెచ్. జగ్గారావు, తహసీల్దార్ ఎల్. శివకుమార్,  మండల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్, పంచాయతీరాజ్ డిఇ వై. హరనాధరావు, మండలంలోని ప్రత్యేక అధికారులు, తోటకూర శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఎపిఎం జగదీశ్వరి, డిపిఎం సి. బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us