గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలు

Updated 22nd April 2017 Saturday 1:45 PM

పెద్దాపురం: గ్రంధాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించే భాండాగారాలని జవహర్ లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాల హెచ్ఎం చావలి రామారావు అన్నారు. స్థానిక శాఖా గ్రంధాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన "గ్రంధాలయ బాట" కార్య క్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేసవి శెలవులు సమయంలో విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. దీని లో భాగంగా మహాత్మాగాంధీ మాధ్యమిక పాఠశాల విద్యార్థులు గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయాధికారి సలాది సాయి సత్యనారాయణ, టి. త్రిమూర్తులు, రమణ, డి. రాజేశ్వరావు, మూర్తి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.     

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us