Crime News : ఒంగోలు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు..పార్కింగ్ లో ఉన్న 9 బస్సులు దగ్ధం..

UPDATED 1st MARCH 2022 TUESDAY 12:05 PM

Fire Accident In AP bus parking : ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు శివారులోని ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్టాండ్ లోని ఉన్న ఓ ప్రైవేట్ బస్ మంటలు ఒక్క సారిగా వ్యాపించాయి. ఈ మంటలు పక్క బస్సులకు కూడా వ్యాపించి ఏకంగా తొమ్మిది బస్సులు..పూర్తిగా తగులబడిపోయాయి. మరో రెండు బస్సులకు మంటలు వ్యాప్తి చెందాయి. పార్కింగ్ స్టాండ్ లో దాదాపు 20 కి పైగా బస్సులు సోమవారం (ఫిబ్రవరి 28,2022)పార్క్ చేయగా ఓ బస్సులో చెలరేగిన మంటలతో ఇంతటి నష్టం ఏర్పడింది.

మంగళవారం ఉదయం సమయంలో ఓ బస్సులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది… బస్సుల్లో చెలరేగుతున్న మంటలార్పుతున్నారు. ఇక ఈ ఘోర అగ్ని ప్రమాదం కారణంగా కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.

ఇక మిగిలిన బస్సులను.. సంఘటన స్థలాలనను తరలించేందు ప్రయత్నిస్తున్నారు ఆ కంపెనీ డ్రైవర్లు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us