UPDATED 25th FEBRUARY 2022 FRIDAY 12:30 PM
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లోనూ వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఇప్పటికే శుక్రవారం వీఐపీ రద్దు చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమాయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది.
ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మొన్న టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుంచి టీటీడీ ఆన్లైన్లో దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి.
అలాగే, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు.ఇక మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేశారు.
అంతేకాకుండా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో అందజేయనున్నారు. టీటీడీ వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఆన్లైన్లో టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి.