ఇంద్ర‌సేన ఫస్ట్ లుక్ విడుద‌ల చేసిన చిరు

UPDATED 5th SEPTEMBER 2017 WEDNESDAY 11:00 PM

మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరోగా మారిన విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికి తెలుగులోకి ఈ హీరోకి ఫుల్ క్రేజ్ ఏర్ప‌డింది. బిచ్చ‌గాడు తర్వాత బేతాళుడు,య‌మ‌న్  చిత్రాల‌తో విజ‌య్ ఆంటోని ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇవి అభిమానుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం సి శ్రీనివాస్ దర్శకత్వంలో ఇంద్రేసేన అనే చిత్రాన్ని చేస్తున్నాడు విజ‌య్ ఆంటోని. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ని మెగాస్టార్ చిరంజీవి  విడుద‌ల చేసారు. ఇందులో విజ‌య్ ఆంటోని లుక్ స్ట‌న్నింగ్‌గా ఉంది. ఈ పోస్ట‌ర్ లాంచింగ్ కార్యక్రమంలో రాధిక‌, విజయ్ ఆంటోనిల‌తో పాటు చిత్ర బృందం హాజరైంది. ఇంద్రసేన సినిమాని విజయ్ ఆంటోని స్వయంగా రాధిక శరత్ కుమార్ తో కలిసి నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీని కూడా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.
 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us