బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప 
ఘనంగా పట్టణంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 
UPDATED 29th MARCH 2018 THURSDAY 5:00 PM
పెద్దాపురం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ఆసుపత్రి వీధిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మరిడమ్మ అమ్మవారి దేవస్థానం కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంపొందించి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆయన అడుగుజాడలలో నడుచుకోవాలని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. పెద్దాపురం, సామర్లకోట ఎఎంసి చైర్మన్లు ముత్యాల వీరభద్రరావు( రాజబ్బాయి), పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు) మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అనంతరం నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, జెడ్పిటిసి సుందరపల్లి శివనాగరాజు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ (సత్తిబాబు), తూతిక రాజు, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు(కోటి) , మండల కో-ఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, ఎఎంసి వైస్ చైర్మన్ ఆచంట రాజబాబు, కౌన్సిలర్ కాకినాడ రామారావు, డాక్టర్ తాళాబత్తుల సాయి, గవరసాన రాజశేఖర్, ఆరిఫ్ ఆలీ, ఎంపిటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.         
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us