Vontimitta Kalyanam : కోదండ రామునికి శ్రీవారి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు

UPDATED 15th APRIL 2022 FRIDAY 06:15 PM

Vontimitta Kalyanam : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శుక్రవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న ఈ కానుకలను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు.ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

అనంతరం వీటిని చైర్మన్ దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్ళి అర్చకులకు అందజేశారు. కోదండ రామాలయం లోని మూల మూర్తికి ఒకటి, ఉత్సవ మూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. ఆలయ ప్రాంగణంలో ని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీర బ్రహ్మం, డిప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్ పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us