బాహుబలి2 పై పనిచేయని సమ్మర్ ఎఫెక్ట్

Updated 30th April 2017 Sunday 11:30 AM

Redbeenews: సినిమాలు ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేయరు. వాటికీ కొన్ని లెక్కలున్నాయి. ముహూర్తాలున్నాయి. సీజన్స్ ఉన్నాయి. అప్పుడే విడుదల చేస్తారు. చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా స్టార్స్ నటించిన మూవీస్ విషయంలో ఇలాంటి లెక్కలు చాలా ఉంటాయి. చాలా జాగ్రత్తలూ తీసుకుంటారు. ఏటా రెండుసార్లు సినిమాల సీజన్ వస్తుంది. ఒకటి సంక్రాంతి, మరొకటి స్టూడెంట్స్ పరీక్షలు అయిపోయాక వచ్చే టైం. రకరకాల కోర్సులు చదివే విద్యార్థులు ఎంచక్కా పరీక్షలు రాసి హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉద్యోగాల పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారిని పక్కన పెడితే టెన్త్, ఇంటర్ పరీక్షలైపోయాయి. డిగ్రీలో కూడా దాదాపు అన్ని కోర్సుల ఎగ్జామ్స్ అయిపోయాయి. సో అందరూ హాలిడే మూడ్ లోనే ఉన్నారు. ఈ కారణంతో చిన్న సినిమా ప్రొడ్యూసర్లు సమ్మర్ లో కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు. సినిమాలకు మహారాజ పోషకులు విద్యార్థులే కాబట్టి .. వాళ్లకు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి వాళ్లంతా తమ సినిమాలకు వస్తారని, ఫుల్ కలెక్షన్స్ ఉంటాయని నిర్మాతలు భారీగా అంచనాలు వేస్తారు. అయితే ఈసారి ఎండల దెబ్బతో ఆ అంచనాలు రివర్స్ అయ్యాయి. విద్యార్థుల పరీక్షలైపోతే తమ సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తాయని చిత్ర నిర్మాతలు వారి వారి సినిమాలను సమ్మర్ లో రిలీజ్ చేశారు. ఫుల్ కలెక్షన్స్ వస్తాయనుకుంటే నిల్ కలెక్షన్స్ సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఎఫెక్ట్ బాహుబలికి ఏ మాత్రం తగలలేదు. జనాలు ఇప్పటికి థియేటర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండిపోతున్నా, జోరుగా వడగాడ్పులు వీస్తున్నా సినిమా హాల్స్ దగ్గర బాహుబలి 2 టిక్కెట్స్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. మరి బాహుబలినా.. మజాకానా ?

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us