Fever Survey : తెలంగాణలో మరోసారి ఫీవర్ సర్వే

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: అటు వాతావరణంలో మార్పులు.. ఇటు కరోనా వ్యాప్తి కారణంగా చాలామందిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ కానున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్ కూడా పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ బీఆర్కే భవన్ లో ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీరు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాల గురించి చర్చించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి ఫీవర్ సర్వే ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రతి జిల్లా, మండలం, గ్రామం.. వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ్టి మీటింగ్ లో ఇదే కీలక అజెండా కానుంది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us