సంక్షేమ పథకాల అమలు వైసీపీకే సాధ్యం

* వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు

UPDATED 4th SEPTEMBER 2021 SATURDAY 3:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుర్తింపు వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. పెద్దాపురం మండలం సిరివాడ గ్రామంలో రూ.21.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజుతో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను మన రాష్ట్రం ప్రజలకు అందిస్తుందని, రాష్ట్రం ఎన్ని వొత్తిళ్ళలో ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని అన్నారు. ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని, రైతులకు సమస్యలు లేకుండా ఆర్థికపరంగా చేయూతనిచ్చి అన్ని విధాలా ఆదుకుంటున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నన్ను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రజలకు సేవలు అందిస్తానని తెలిపారు. సామర్లకోట రైతు బజారు, పెద్దాపురం పట్టణంలో మార్కెటింగ్ కమిటీ భవనం, మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని దొరబాబు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇవో ఎన్.వి.వి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్. విజయ్ కుమార్, ఏడీఏ ఎం. రత్న ప్రశాంతి, ఉద్యాన శాఖ అధికారిణి సుజాత, డి.ఆర్.సి డీడీ నాగేశ్వరరావు, ఏడీ రాజశేఖర్, వ్యవసాయ అడ్వైజర్ కమిటీ మెంబర్ యేలేటి అనంతలక్ష్మి, ఎంపిడివో ఏ. రమణారెడ్డి, తహశీల్దార్ బి. శ్రీదేవి, వార్డు మెంబర్లు, రైతు భరోసా, ఉద్యానవన, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us