UPDATED 21 JANUARY 2022 FRIDAY 09:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్) : ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల నిరవధిక సమ్మె ఉంటుందని బండి శ్రీనివాసరావు చెప్పారు. ఆర్టీసీ సహా అన్ని సంఘాలు సమ్మెలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలపై అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయొద్దని బండి శ్రీనివారావు సూచించారు. తమ ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీని తీసుకోమని బొప్పరాజు అన్నారు. సీపీఎస్ రద్దుకు ఎక్కువ సమయం సరైంది కాదని బొప్పరాజు తెలిపారు.