ధైర్యంగా ఉండండి..నేనున్నాను : వరద బాధితులతో జగన్‌

కడప (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఏపీ సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో బాధితులతో సీఎం మాట్లాడారు. గ్రామంలో తిరుగుతూ వారిని పరామర్శించారు. ఇళ్లు కోల్పోయిన వరద బాధితులు సీఎం వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. వరదలతో సర్వం కోల్పోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జగన్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. ‘నేనున్నాను.. ధైర్యంగా ఉండండి’ అని జగన్‌ హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన రూ.90వేల సాయం సరిపోదని.. ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎంను కోరారు. ఇళ్లు నిర్మించే బాధ్యత నాది.. అన్ని విధాలుగా ఆదుకుంటానని జగన్‌ వారికి చెప్పారు. అనంతరం గ్రామంలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us