గంజాయి ముఠా అరెస్టు

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 30 ఆక్టోబర్ 2021: కాకినాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 10 మందిని అరెస్టు చేశామని ఏఎస్పీ కరణం కుమార్‌ తెలిపారు. రెండో పట్టణ పోలీస్‌ష్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుకు వచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ భీమారావు పర్యవేక్షణలో సీఐలు ఈశ్వరుడు, రమణ సిబ్బందితో గంజాయి అమ్ముతున్న కాకినాడకి చెందిన మజ్జి విజయ్‌ కుమార్‌ (29), రాజశేఖర్‌ (25), సాయితేజ (23), ప్రసాద్‌ (20), గొల్లప్రోలు మండలానికి చెందిన అయ్యప్ప (28)ను ఈ నెల 29వ తేదీన అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ.2.40 లక్షలు విలువ చేసే 24 కిలోల గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, రూ.45 వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాకినాడ గ్రామీణ ప్రాంతానికి చెందిన వలస గిరిధర్‌, రాగూర్‌, మహేష్‌, ఉదయేశ్వరరావు తదితరులను అరెస్టు చేసి రూ.2.30 లక్షల విలువ చేసే 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కాకినాడ పరిధిలోని పోలీస్‌ష్టేషన్‌లో చోరీ కేసులు ఉన్నాయని, హిస్టరీ షీట్స్‌ ఓపెన్‌ చేస్తామన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us