పెద్దాపురం ఎంఎల్ఏగా చినరాజప్ప గెలుపు

UPDATED 24th MAY 2019 FRIDAY 9:00 PM

పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మకాయల చినరాజప్ప తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తోట వాణిపై 4,417 ఓట్ల మెజారిటీతో గెలుపొంది విజేతగా నిలిచారు. ఈ మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎన్‌.ఎస్‌.వి.బి. వసంత రాయుడు చినరాజప్పకు ధృవీకరణ పత్రం అందజేశారు. 2014వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోనసీమ ప్రాంతానికి చెందిన చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 10,663 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు  చినరాజప్పకు మరోసారి పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,61,040 ఓట్లు పోలవగా తెలుగుదేశంకు 66,750 ఓట్లు రాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  62,333 ఓట్లు వచ్చాయి. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us