తెలుగుదేశాన్ని మరోసారి దీవించండి

* ఎంతో చేశా.. వచ్చే అయిదేళ్లలో ఇంకా చేస్తా
* ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తా
* హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప

UPDATED 9th APRIL 2019 TUESDAY 4:00 PM

పెద్దాపురం: ఈ నెల 11వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరోసారి దీవించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం పట్టణంతో పాటు మండల పరిధిలోని జె. తిమ్మాపురం, గుడివాడ, జి. రాగంపేట గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, మరింత సంక్షేమం కోసం తెలుగుదేశంకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. విభజన అనంతరం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని అన్నిరకాలుగా అగ్రభాగంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గత అయిదేళ్లల్లో నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, వచ్చే అయిదేళ్లలో మరింత అభివృద్ధి చేసేందుకు తనకు ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఏఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), వైస్ చైర్మన్ ఆచంట రాజన్న, మండల కోఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, ఎంపిపి గుడాల రమేష్, మున్సిపల్  చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఆరిఫ్ ఆలీ, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.                 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us