పాపికొండల విహారానికి పచ్చజెండా

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 27 అక్టోబర్ 2021: పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబరు 7 నుంచి పాపికొండలు విహార యాత్ర ప్రారంభిస్తామని జిల్లా పర్యాటక శాఖ డివిజనల్‌ మేనేజర్‌ తోట వీరనారాయణ పేర్కొన్నారు. ఈమేరకు విజయవాడలో బుధవారం జరిగిన బోటు ఆపరేటర్ల సమావేశంలో విధివిధానాలను సూచించారన్నారు. గండిపోచమ్మ, పోచవరం కంట్రోల్‌ రూమ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలనీ, సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండాలని సూచించారన్నారు. పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లు ధరించాలని ఆదేశించారన్నారు. రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు వెళ్లేందుకు రూ.1,250 టిక్కెట్‌ ధర చెల్లించాలన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us