వరద బాధితుల కోసం విరాళాల సేకరణ

UPDATED 18th AUGUST 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: కేరళ రాష్ట్రం వరద బాధితుల సహాయార్ధం పట్టణంలో సిపిఎం పట్టణ పార్టీ కార్యకర్తలు శనివారం నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారస్తుల నుంచి మంచి స్పందన లభించింది. సిపిఎం నాయకులు జోలె పట్టి గడపగడపకూ వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయని, ప్రజా జీవితం అతలాకుతలం అయ్యిందన్నారు. రాష్ట్రం జల విలయంలో చిక్కుకుందని, ప్రాణ, ఆర్థిక నష్టానికి గురి అయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం ప్రసాదరావు, తుంపాల శ్రీనివాస్, బాలం శ్రీనివాస్, కరణం శ్రీనివాసరావు, నమ్మి భద్రరావు, బత్తుల బాలాజీ, బాలం సత్తిబాబు, కరణం గోవిందరాజు, కరణం సత్యనారాయణ, ఫాతిమా బీబీ, యువరాజు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us