ఛలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరణ

Updated 24th April 2017 Monday 11:30 AM 
పెద్దాపురం : భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 25 న చేపట్టిన "ఛలో విజయవాడ" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు మండలాధ్యక్షుడు గడిగట్ల సత్తిబాబు పిలుపునిచ్చారు. స్థానిక వరహాలయ్యపేటలోని యాసలపు సూర్యారావు భవనంలో "ఛలో విజయవాడ" పోస్టర్ ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ఈ సంక్షేమ నిధిని రక్షించడంతో పాటు ఈ నిధి ద్వారా మరిన్ని కొత్త పధకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ "ఛలో విజయవాడ" నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు పానిశెట్టి రత్నగిరి వర ప్రసాద్, బైలపూడి నూకరాజు, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజమహేంద్రవరపు రామారావు, చొక్కాకుల లక్ష్మణరావు, పోతాబత్తుల చినబాబు, ఎస్. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.       
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us