Prabhas : అందరూ నా పెళ్లి గురించే అడుగుతారు..

UPDATED 17 APRIL 2022 SUNDAY 06:00 AM

Prabhas : ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలితో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో అభిమానులని పలకరించాడు. ఇక అమ్మాయిల్లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ గురించి అందరి మనస్సులో ఉన్న ప్రశ్న ఒక్కటే, ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని. ప్రభాస్ ఒప్పుకోవాలి కానీ అతన్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు.

ఇక ప్రభాస్ ఎప్పుడు మీడియా ముందుకి వచ్చినా అతన్ని అడిగే మొదటి ప్రశ్న కూడా పెళ్లి గురించే. ప్రభాస్ నే కాదు ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతారు. ఇటీవల రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్ కి ఈ ప్రశ్న ప్రతి ఇంటర్వ్యూలో ఎదురైంది. తాజాగా మరోసారి ఈ ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్‌ ని మీ పెళ్లెప్పుడు అని యాంకర్ అడిగారు.ఈ ప్రశ్నకి ఎప్పటిలాగే నవ్వుతూ ‘దానికి నా దగ్గర సమాధానం లేదు. నాకు తెలిసినప్పుడు అందరికీ నేనే చెప్తాను’ అని అన్నారు ప్రభాస్.

ఇక ఎక్కడకు వెళ్లినా మీ పెళ్లి గురించే అడుగుతుంటారు కదా. అది మీకు చిరాకు తెప్పించదా? అని అడుగగా దీనికి ప్రభాస్ సమాధానమిస్తూ.. ”అందరూ నా పెళ్లి గురించే అడుగుతారు. అయినా నాకెప్పుడూ చిరాకు అనిపించదు. నా గురించి వారంతా ఎంతలా ఆలోచిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను, అయినా అలా అడగడం సాధారణ విషయమే. వారి స్థానంలో నేనున్నా కూడా అలానే ఆలోచించి అడుగుతాను” అని తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us