హోం ఐసోలేషన్ పట్ల అపోహలు వద్దు

* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

UPDATED 23rd JULY 2020 THURSDAY 7:00 PM

అమలాపురం(రెడ్ బీ న్యూస్): కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులను హోం ఐసోలేషన్ లో ఉంచడం వల్ల తమకు వైరస్ సోకుతుందనే భయం ప్రజల్లో ఉందని, హోం ఐసోలేషన్ వల్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి అన్నారు. అమలాపురం డివిజన్ పరిధిలో కరోనా పాజిటివ్ సోకిన భాదితుల కోసం అల్లవరం మండలం బోడసకుర్రులో గల టిడ్కో భవన సముదాయంలో సుమారు రెండు వేల పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ముందుగా సిసిసి సెంటర్ లోని అన్ని విభాగాలను పరిశీలించి ఇంకనూ తీసుకోవాల్సిన చర్యలు గురించి అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడు వేలమంది కరోనా పాజిటివ్ సోకిన బాధితులను హోం ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందని, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇంటిలో ప్రత్యేక గదిలో వీరిని ఉంచి వైద్య చికిత్స అందించడం వల్ల కుటుంబ సభ్యులకు కూడా ఏ విధమైన సమస్యలు రాలేదని అన్నారు. జిల్లాలో కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాలను పరిశీలిస్తే చాలా వరకు బీపీ, షుగర్ వ్యాధులతో పాటు తీవ్రమైన ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారే మరణించినట్లు గుర్తించామని అన్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయి కొద్దిపాటి లక్షణాలు ఉన్న బాధితులను కోవిడ్ కేర్ సెంటర్లో, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. బోడసకుర్రులోని సిసిసి సెంటర్, రాజమహేంద్రవరంలోని బొమ్మూరు సిసిసి సెంటర్ ఐదు వేల మంది పాజిటివ్ రోగులకు చికిత్స  అందించే సామర్ధ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. కరోనా బాధితులకు సేవలు అందించే వైద్య సిబ్బంది తమ డ్యూటీ అనంతరం ఇళ్ళకు వెళ్తుంటే చుట్టుపక్కల వారు వారి నుంచి కరోనా సోకుతుందని అడ్డుకుంటున్నారని ఇలాంటి అపోహలు ప్రజలు విడనాడాలని, ఇలా ఎవరైనా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు, డిఎస్పీ షేక్ మాసూం భాషా, ఏడిఎం&హెచ్ఓ డాక్టర్ పుష్కరరావు, మునిసిపల్ కమీషనర్ కెవివిఆర్ రాజు, డిఈఈ అప్పలరాజు, అల్లవరం మండల తహసీల్దార్ అప్పారావు, ఎంపిడిఓ సుగుణ శ్రీకుమారి, గోడిలంక వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us