MLC Kavitha:ఎల్ఐసీని ఎందుకు విక్రయిస్తున్నారు? కేంద్రానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న!

UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 12:30 PM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (TRS MLC Kavitha) సూటి ప్రశ్నను సంధించారు. సీఎం కేసీఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలన్నారు. అసలు లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలన్నారు. అది దేశం కోసమా? దేశం అంటే మట్టి మాత్రమే కాదన్నారు.ఎల్ఐసీ (LIC) అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్తితి ఏమిటన్న ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్మాల్సి వస్తుందో చెప్పాలని సీఎం అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలన్నారు.

ఎక్కడైనా నష్టాలు వస్తే.. ప్రభుత్వ సంస్థలను అమ్ముతారు.. కానీ, లాభాల్లో ఉన్న ఎల్ఐసీని అమ్మేస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడంపై మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధించారు. సింగరేణి సంస్థ (Singareni) మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. సింగరేణి బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్నారని అన్నారు.సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో, దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించింద‌ని గుర్తు చేశారు.

లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ, 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోంది అని తెలిపారు. ఇది సమాఖ్య స్పూర్తికి పూర్తిగా విరుద్దమన్నారు.సింగరేణి ప్రైవేటీకరణ (Singareni privatisation) ను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది అని మండిప‌డ్డారు. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకూ, కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంద‌ని ఎమ్మెల్సీ క‌విత తేల్చిచెప్పారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us