మృతదేహంతో ఆశా కార్యకర్తల ఆందోళన

గంగవరం (రెడ్ బీ న్యూస్) 24  నవంబర్ 2021: అడ్డతీగల సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏటిపల్లికి చెందిన ఆశా కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో జిల్లా ఆశా కార్యకర్తలు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలీం కోట రమణమ్మ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. కాకినాడ నుంచి మృతదేహాన్ని ఏటిపల్లి తరలిస్తుండగా గంగవరం పీహెచ్సీ ముందు వాహనాన్ని నిలిపివేసి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రమణ మాట్లాడుతూ మృతికి వైద్యాధికారి నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణమన్నారు. చిన్నారి మృతికి వైద్యాధికారి బాధ్యుడిని చేయాలని, అలాగే రూ. పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సై షరీఫ్ కలగజేసుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో గంగవరం పిడతమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us