UPDATED 2nd MAY 2022 MONDAY 07:50 PM
Extramarital affair : ములుగు జిల్లా ఏటూరునగరం మండలం చిన్నబోయినపల్లిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త. భార్యను ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తాళ్లతో కట్టేసి పెద్ద మనుషుల ముందు నిలబెట్టాడు.
ఏటూరునాగారం మండలం కొండాయి బీట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న మహిళ.. కారు మెకానిక్‌గా పనిచేస్తున్న రాసాల లింగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే కొంతకాలంగా ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమె కదలికలను గమనించాడు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నర్సాపూర్‌లోని ఓ ఇంట్లో ఇద్దరు ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తప్పించుకొని పారిపోకుండా తాళ్లతో బంధించాడు. గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.