ఆగష్టు 31 నాటికి నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

* జిల్లా జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి

UPDATED 14th AUGUST 2020 FRIDAY 7:30 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణ పనులు ఈనెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, కమీషనర్ వి. చిన వీరభద్రుడు అమరావతి నుంచి నాడు-నేడు కార్యక్రమం పై శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి జేసి కీర్తి చేకూరి, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జిల్లాలో 1336 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడులో భాగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వీటితో పాటు నాబార్డు నిధులతో మరో 36 పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణ పనులు ఈనెలాఖరు నాటికి పూర్తి చేసి, వచ్చేనెల 5వ తేదీ పాఠశాలలు పునఃప్రారంభం నాటికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహాం, ఎస్ఎస్ఎ పీవో బి. విజయభాస్కర్, పంచాయితీరాజ్ ఎస్ఈ ఎన్. నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us