ట్రెండ్స్ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం

UPDATED 23rd DECEMBER 2020 WEDNESDAY 5:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణ పరిధిలో మెయిన్ రోడ్డులో ఉన్న ట్రెండ్స్ వస్త్ర దుకాణంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఏడీఎఫ్ఓ పేరూరి శశాంక శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం వస్త్ర దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పై అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతో కొంతమేర బట్టలకు నిప్పు అంటుకుని దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. బట్టల దుకాణం నిర్వహిస్తున్న భవనానికి ఎలాంటి అగ్నిమాపకశాఖ అనుమతులు లేవని, పైగా అత్యవసర ద్వారం కూడా లేదని అన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.25 వేల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us