జనహితునికి జేజేలు

* జనసంద్రమైన రహదారులు  
* దిగ్విజయంగా సాగిన సంకల్ప యాత్ర 
* కష్టాలు వింటూ అండగా ఉంటానని భరోసా
UPDATED 22nd JULY 2018 SUNDAY 10:00 PM
సామర్లకోట: ప్రతిక్షణం ప్రజాహితమే లక్ష్యంగా, కర్షక, కార్మిక, నిరుద్యోగ, ఉద్యోగులకు అండగా నిలవడమే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 218వ రోజు మండలంలోని అచ్చంపేట జంక్షన్ ఎడిబి రోడ్డు వద్ద పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. పెద్దాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జగన్ కు ఘన స్వాగతం పలికారు. అచ్చంపేట, గొంచాల, బ్రహ్మానందపురం గ్రామాల మీదుగా సాగిన పాదయాత్ర రాత్రికి ఉండూరు చేరుకుంది. యువతులు జగన్ కు ఆప్యాయంగా రాఖీలు కట్టగా, మహిళలు హారతిపట్టారు. వైఎస్‌ వేషధారణలో పలువురు చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ గ్రామాలకు వచ్చిన జననేతపై పల్లె ప్రజలు అభిమాన వర్షం కురిపించారు. సెల్ఫీలు దిగుతూ, ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ విదార్థినిలు మురిసిపోయారు. అచ్చంపేట, గొంచాల మార్గం మధ్యలో 216 జాతీయ రహదారి నిర్మాణం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అక్కడ వంతెన నిర్మించాలని మండల వైఎస్సార్ సిపి అధ్యక్షుడు తాటికొండ అచ్చిరాజు, పవర సర్పంచ్ తోట సత్య అప్పారావు, నవర ఉప సర్పంచ్ కేశవరపు ప్రభాకరరావు జగన్ దృష్టికి తీసుకురాగా, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దవులూరి దొరబాబు, ఆకుల సూర్యనారాయణ, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, కంటే వీర రాఘవరావు, దవులూరి సుబ్బారావు, మద్దాల శ్రీను, గవరసాన సూరిబాబు, ఇనకొండ వీర విష్ణుచక్రం, మేకా శ్రీనివాస్, ఉద్ధగిరి సతీష్, రమేష్ రెడ్డి, నాగిరెడ్డి వాసు, సేపేని సురేష్, కానుబోయిన విజయకృష్ణ, గోపు మురళీ,  కానేటి ఎలిజబెత్ రాణి, ఊబా జాన్ మోజస్, పితాని సూర్యనారాయణ, నేతల హరిబాబు, వాసంశెట్టి గంగ,  బొబ్బరాడ సత్తిరాజు, బంగారు కృష్ణ, శెట్టిబత్తుల దుర్గ, గంగిరెడ్డి కృష్ణమూర్తి, అంజల రాణి సత్యన్నారాయణ, కర్రి బుజ్జి, పేర్నేటి రాయుడు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు. 
 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us