ప్రజా సమస్యలు పరిష్కారమే గ్రామదర్శిని లక్ష్యం

UPDATED 10th AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ప్రజా సమస్యలు పరిష్కరించడమే గ్రామదర్శిని లక్ష్యమని, క్రమశిక్షణతో ప్రజా సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజల అభిమానాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు పొందవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, అధికారులతో కలిసి శుక్రవారం పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన కాపు కల్యాణ మండపం పనులను పరిశీలించి, సిసిరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరచాలని పంచాయతీరాజ్ డిఇ వై. హరినాధరావును మంత్రి ఆదేశించారు.  ఈ సందర్భంగా జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ అచ్చంపేట గ్రామంలో అభివృద్ధి పనులకు రూ.18 కోట్లు ఖర్చు చేశామని, ఇళ్ల సమస్య పరిష్కారానికి స్థలం కొరత ఉందని, దాతలు ముందుకు వస్తే వారికి ప్రభుత్వం తరుపున రూ. 25 లక్షలు, కాలనీకి వారి పేరు పెట్టడం జరుగుతుందని చెప్పారు. వృద్ధాప్య పింఛన్లుతో పాటు ఒంటరి మహిళలకు రూ.1000 పింఛన్లు ఇస్తున్నామని, ఏడు గ్రామాల్లో కరెంటు సమస్య ఉందని,  నవరలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ ఏర్పాటుకు సాంకేతికపరమైన సమస్య ఏర్పడిందని, దీనిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. రూ. 50 లక్షలతో కాపు కళ్యాణ మండపం నిర్మాణంతో పాటు మరో 25 లక్షలతో వంట షెడ్, డ్రైనింగ్ హాలు ఏర్పాటు చేస్తామని, రూ. ఐదు కోట్లు ఆర్ అండ్ బి నిధులతో అచ్చంపేట నుంచి ఉండూరు వరకు రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రాథమిక హెల్త్ సెంటర్లను అభివృద్ధి పరచి గర్భిణీ స్త్రీలకు ఉచిత డెలివరీతో పాటు రూ.1000 పారితోషికం, తల్లి-బిడ్డ కిట్స్,తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో నులిపురుగులు నివారణకు చిన్నారులకు మందులు వేయించాలని ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రచురించిన గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట, పెద్దాపురం ఎంపిపిలు ఆకునూరి సత్తిబాబు, గుడాల రమేష్, జెడ్పీటీసీలు గుమ్మళ్ళ విజయలక్ష్మి, సుందరపల్లి శివనాగరాజు, చిట్టిబాబు, మాజీమంత్రి పి.వి. రాఘవులు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, తోటకూర శ్రీనివాస్, అన్నవరం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, ఎంపిడివో ఇంచార్జ్ జగ్గారావు, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, మాజీ సర్పంచులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us