చినబ్రహ్మదేవంలో భగవద్గీత శ్లోక పోటీలు

UPDATED 19th AUGUST 2018 SUNDAY 9:00 PM

పెద్దాపురం : పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద భగవద్గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోక పోటీలు ఆదివారం నిర్వహించారు. భగవద్గీత ప్రచార సమితి వ్యవస్థాపకుడు సి. మల్లిఖార్జునస్వామి పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు.  ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పూర్ణ మహేశ్వరి, శుభారాణి, వైష్ణవి, నాగసతీష్, జగన్ రావు, సంధ్య, సిరి, రత్నశ్రీ, సత్యశ్రీ తులసి, చిన్నబుజ్జి, నందిని, సత్యగంగాధర్, భానుగణేష్ లకు  ఆలయ చైర్మన్ బట్రెడ్డి వెంకన్నబాబు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో సమితి ఆర్గనైజర్ సి. సత్యకుమార్, కన్వీనర్ పచ్చిపాల ప్రసాదరావు(గోరింట ప్రసాద్), భాష్యం రామానుజాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us