హిందువుల మనోభావాలకు ఆదర్శంగా ఇస్కాన్ దేవాలయాలు

UPDATED 16th AUGUST 2018 THURSDAY 5:00 PM

సామర్లకోట: హిందువుల మనోభావాలకు ఆదర్శంగా ఇస్కాన్ దేవాలయాలు ఆహ్లాదకరంగా, ప్రశాంత వాతావరణంలో కలిగి ఉంటాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని అచ్చంపేటలో 2.1 ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్లతో నిర్మించనున్న ఇస్కాన్ దేవాలయానికి  మంత్రి చినరాజప్ప జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా, కాకినాడ రూరల్ ఎంఎల్ఏ వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణతో కలిసి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలు విస్తరించి భక్తిభావనలను పెంపొందిస్తున్నాయని అన్నారు. ఇస్కాన్ దేవాలయాలతో పాటు సెంటర్లు కూడా కలిగి ఉన్నాయని, ఇస్కాన్ ద్వారా పుష్కరాల్లో ఉచిత భోజన సదుపాయాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. దైవానుగ్రహాన్ని ప్రతీ ఒక్కరూ పొంది క్రమశిక్షణతో జీవితాన్ని గడపాలని అన్నారు. రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ దేవాలయాన్ని ఎంతో మంది యాత్రికులు సందర్శిస్తున్నారని, త్వరలో ఈ ప్రాంతంలో దేవాలయం ఏర్పాటు ద్వారా భక్తి ప్రభోదాలతో పాటు వారి సేవలు కూడ పొందవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా మాట్లాడుతూ ఇస్కాన్ దేవాలయాలు భక్తుల మనోభావాలను ఆకర్షిస్తున్నాయని, ఇస్కాన్ సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐడివియం మినిస్టర్ భక్తి రాఘవస్వామి, కాకినాడ ఇస్కాన్ ఆలయం ఇంచార్జ్ అనంతశేషు, అచ్చంపేట మాజీ గ్రామ  సర్పంచ్ పి. నాగమహేశ్వరి రాంబాబు, మాజీ ఉప సర్పంచ్ పబ్బినీడి ఈశ్వరరావు, ఇస్కాన్ దేవాలయాల సభ్యులు, సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us